- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడలో బండి సంజయ్ పర్యటన
by velandi.Saikiran |
బండి సంజయ్ కుమార్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల

X
దిశ, వేములవాడ టౌన్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ తన జన్మదినం సందర్భంగా మోడీ కానుకగా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని, వేములవాడలో జరిగే ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ లు కోరారు.
Next Story






