- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ కి మేయర్ పదవీ దక్కడానికి కారణం బండి సంజయ్ కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకరే : సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
కరీంనగర్ లో బీజేపీ బలపడటానికి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్ లను ఎన్నికల ముందు బీజేపీలోకి పంపించి, బీజేపీ కి నగర మేయర్ పదవి దక్కడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరోక్షంగా సహకరించారని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు.

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ లో బీజేపీ బలపడటానికి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్ లను ఎన్నికల ముందు బీజేపీలోకి పంపించి, బీజేపీ కి నగర మేయర్ పదవి దక్కడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరోక్షంగా సహకరించారని, మేయర్ పదవి బీజేపీ కి దక్కడానికి కారణం బండి సంజయ్ ఘనత ఏమి లేదని, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారం వల్లనే సాధ్యమైందని, బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం, నేటి మేయర్ ఎన్నికకు సంబంధించిన అంశంతో నగర ప్రజల ఎదుట బహిర్గతమైందని, ఈ లోపాయ కారి ఒప్పందాలు, చీకటి పొత్తులు కరీంనగర్ చరిత్రలో చీకటి రోజు అని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నిక అనంతరం సోమవారం ఎంఐఎం పార్టీ కార్యాలయం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. స్వలాభం కోసం, రాజకీయ అవసరాల కోసం, కోట్లాది రూపాయలను వెనుక నుంచి తీసుకొని, కరీంనగర్ ప్రజల భవిష్యత్ ను బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టిందని ఆరోపించారు.
మేయర్ కావడానికి కాంగ్రెస్ పార్టీతో క్యాంపు రాజకీయాలు చేసి తీరా సమయానికి బీజేపీ మంత్రి బండి సంజయ్ ముందు ఎమ్మెల్యే గంగుల మౌనం వహించి మోకరిల్లడం బీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాలను నగర ప్రజలు గ్రహించాలన్నారు. మేయర్ పదవికి సంబంధించి ఓటింగ్ లో తటస్థంగా ఉండి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం మహిళా కార్పొరేటర్ పేరును ప్రతిపాదించగానే ఆగ మేఘాల మీద బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు లేచి వెళ్లిపోవడం చూస్తుంటే బీజేపీ కంటే ముస్లింలకు అత్యంత ప్రమాదకరం బిఆర్ఎస్ పార్టీని కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానం ముస్లిం మహిళా కార్పొరేటర్ ను ఘోరంగా అవమానించడమేనని చెప్పారు. బీజేపీకి, బీఆర్ఎస్ మద్దతునిచ్చిన తీరును చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజని అభివర్ణించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హై కమాండ్ ఆదేశాలతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే, ఎంఐఎం పార్టీ నలుగురు కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. నలుగురు కార్పొరేటర్లు ఎంఐఎం పార్టీలో ఉన్నామని కృంగిపోమని, 40 మంది కార్పొరేటర్లకు సమానంగా నగరవ్యాప్తంగా దళిత, బిసి, ముస్లిం డివిజన్ల అభివృద్ధికై పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గెలిచిన ఓడిన డివిజన్లను అలుపెరగకుండా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకొని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు ఆతిన, మాజిద్ హుస్సేన్, ఇబ్రహీం, మొహసిన్ మోహియోద్దీన్ పాల్గొన్నారు.






