- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్ పాదయాత్రలో తేనెటీగల దాడి
రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను ఫొటో తీసేందుకు డ్రోన్ ఎగురవేశారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ చెట్టు పై తేనెటీగల తుట్టేను డ్రోన్ తాగడంతో ఒక్కసారిగా తేనెటీగలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశాయి.

దిశ, కొత్తపల్లి : రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలో పాదయాత్ర చేస్తున్న కార్యకర్తలను ఫొటో తీసేందుకు డ్రోన్ ఎగురవేశారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ చెట్టు పై తేనెటీగల తుట్టేను డ్రోన్ తాగడంతో ఒక్కసారిగా తేనెటీగలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో ర్యాలీ లో కార్యకర్తలు గందరగోళానికి లోనయ్యారు. కొందరు కార్యకర్తల పై తేనెటీగలు దాడి చేయడంతో చికిత్స అందజేశారు. అప్రమత్తమైన బండి సంజయ్ వెంటనే గాయపడ్డ కార్యకర్తలను ఆసుపత్రికి పంపించారు. అనంతరం బండి సంజయ్ కి వైద్యులు రొటీన్ చెక్ అప్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే 17 కి.మీల మేరకు పాదయాత్ర పూర్తి చేసిన కేంద్ర మంత్రి గంగాధర మండల కేంద్రానికి చేరుకోని అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సాయంత్రం 6.30 గంటల వరకు కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది.






