మా ఊరి బలగంతో... బలగం మూవీ వీక్షణ

by S Gopi |

మానవ విలువలు మరిచి, స్వార్థలతో, ద్వేశలతో చిన్న చిన్న గొడవలకు దూరం అవుతున్న.... Balagam Movie

మా ఊరి బలగంతో... బలగం మూవీ వీక్షణ
X

దిశ, కోనరావుపేట: మానవ విలువలు మరిచి, స్వార్థలతో, ద్వేశలతో చిన్న చిన్న గొడవలకు దూరం అవుతున్న బంధాలకు కనువిప్పుకలిగిస్తుంది బలగం చిత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం సాయంత్రం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, యువత ప్రోత్సాహంతో గ్రామంలో విలువలు మరిచి దూరం అవుతున్న కుటుంబాలు ఈ సినిమా చూస్తే కలువలనే ఆలోచన వస్తదని బలగం మూవీని అందరితో కలిసి ప్రదర్శించారు. దాదాపు 400 నుండి 500 మంది వరకు గ్రామస్తులు మరియు పక్క గ్రామాల నుండి ప్రజలు అధికంగా వచ్చి వారి బలగంతో కలిసి బలగం సినిమాను వీక్షించారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చివరి 15 నిమిషాలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంతైనా బలగం సినిమా....చూసిన ఆ ఊరి అందరి బలగాలని దగ్గర చేసింది.

Next Story