- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హూజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి. కిషన్ నియామకం
by Ratna Kumari |
హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ బి.కిషన్ ని నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ బి.కిషన్ ని నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 35 మంది కమిషనర్ల బదిలీల్లో భాగంగా ఈ మార్పు జరిగింది. ప్రస్తుతం సెక్రటేరియట్‌లోని ఎల్ అండ్ టి విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. కిషన్‌ను హుజరాబాద్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ పని చేసిన కమిషనర్ ముసబ్ అహ్మద్‌ను బదిలీ చేస్తూ, సీడీఎంఏ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ముసబ్ అహ్మద్ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ కావడం గమనార్హం. మున్సిపల్ పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. నూతన కమిషనర్ కిషన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
Next Story






