- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యం తో మరణించిన ఆటో డ్రైవర్..!
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ పెద్ద కర్రోళ్ల బద్రి కుటుంబానికి ఆదర్శ ఆటో యూనియన్ మండల ఉపాధ్యక్షుడు గుడికడి మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.

X
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ పెద్ద కర్రోళ్ల బద్రి కుటుంబానికి ఆదర్శ ఆటో యూనియన్ మండల ఉపాధ్యక్షుడు గుడికడి మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు. యూనియన్ ఉపాధ్యక్షుడు గుడికడి మహేష్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల కష్ట సుఖాలలో సమస్యల పరిష్కారంలో బద్రి ముందుండేవాడు అన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే పెద్ద కుర్రోళ్ల బద్రి మరణించడం బాధాకరం అన్నారు. ఆటో డ్రైవర్ల నుంచి సేకరించిన 5500 నగదు తో పాటు 50 కిలోల బియ్యాన్ని మృతుడి కుటుంబానికి అంద జేశామని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు మహేష్,స్వామి, కిషన్, భూమయ్య, ఖలీల్, జనార్ధన్, పందిళ్ళ రాజు, జంగం రాజు పాల్గొన్నారు.
Next Story






