దొరికిన బంగారం..తిరిగి ఇచ్చేసిన ఆటో డ్రైవర్‌

by velandi.Saikiran |

తన ఆటోలో దొరికిన అర తులం బంగారు ఉంగరం మళ్లీ ఆ యజమానికే అందేలా చేసి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్‌.

దొరికిన బంగారం..తిరిగి ఇచ్చేసిన  ఆటో డ్రైవర్‌
X

దిశ, గంభీరావుపేట: తన ఆటోలో దొరికిన అర తులం బంగారు ఉంగరం మళ్లీ ఆ యజమానికే అందేలా చేసి అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు ఓ ఆటోడ్రైవర్‌. మనిషి నిజాయితీకి అద్దం పట్టే ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని గజ సింగవరం గ్రామంలో చోటుచేసుకుంది. గజ సింగవరంకు చెందిన ఆటో డ్రైవర్ అరుట్ల రాజేష్ కు అర తులం వంకు ఉంగరం తన ఆటోలో దొరికింది. ఈ త‌రుణంలోనే గజ సింగవరం యాదవ సంఘం అధ్యక్షులు చేకూరి దేవయ్య, గ్రామ సర్పంచ్ ఉమా రెడ్డి విమల, శంకర్ కు ఆ ఉంగ‌రాన్ని అప్పగించాడు. ఇక బుధవారం రోజున పోగొట్టుకున్న బంగారు ఉంగరం యజమానికి యాదవ సంఘం అధ్యక్షులు దేవయ్య సర్పంచ్, విమల శంకర్ వారికి అప్పగించారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్‌ రాజేష్ ను అంద‌రూ అభినందించారు.

Next Story