Audio Viral: చర్చనీయాంశంగా మారిన నాగార్జున డైరీ అంశం.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఆడియో

by Shiva |
Audio Viral: చర్చనీయాంశంగా మారిన నాగార్జున డైరీ అంశం.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఆడియో
X

దిశ, హుజురాబాద్: హుజూరాబాద్‌లో నాగార్జున డైరీ వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్‌కు సన్నిహితుడినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టిస్తున్నాడు. నాగార్జున డైరీ యజమాని పుల్లురి ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి సెటిల్‌మెంట్ చేసుకొమ్మని, ప్రభుత్వం నుంచి ఎలాంటి గొడవ ఉండదని చెప్పిన ఓ ఆడియో తెగ వైరల్ అవుతోంది. సంపత్ గత కొన్ని రోజులుగా నాగార్జున డైరీ‌పై పత్రికల ద్వారా స్టేట్‌మెంట్లు, ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో ప్రభాకర్ రావు, సంపత్‌కు కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయంలో ప్రభాకర్ రావు లీగల్‌గా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం సంపత్ అనుచరుని పేరిట ఓ వ్యక్తి ప్రభాకర్ రావుకు కాల్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు.

Audio Viral: చర్చనీయాంశంగా మారిన నాగార్జున డైరీ అంశం.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఆడియోదీంతో ఆయన ఒక్కపైసా ఇవ్వనని చెప్పడంతో అవతలి వ్యక్తి రూ.10 లక్షలకు సెటిల్ చేసుకుందని బేరానికి వచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంభాషణ మధ్యలో ఈటెల, ప్రణవ్ బాబు, పొన్నం ప్రభాకర్ పేర్లు రావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఈ మొత్తం వ్యవహారం‌పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. కాగా, గత కొన్ని రోజుల క్రితం ఓ అజ్ఞాత వ్యక్తి ప్రభాకరరావు‌కు ఫోన్ చేసి డైరీ ప్లాంట్ చుట్టూ బాంబులు పెడతామని బెదిరింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా నాగార్జున డైరీ యజమాని ప్రభాకర్ రావుతో సంపత్ వ్యవహారం నియోజకవర్గం‌లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story