- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలలో అటెండర్ ఆకృత్యాలు
గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో వెలుగు చూసిన అటెండర్ ఆకృత్యాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేసాయి.

దిశ, గంగాధర: గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో వెలుగు చూసిన అటెండర్ ఆకృత్యాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేసాయి. అయితే అటెండర్ గత ఏడాదిగా వికృత చేష్టలకు పాల్పడుతున్నప్పటికీ అధికారుల మౌనం అంతచిక్కడం లేదు. సంవత్సర క్రితం విద్యార్థినిలు అటెండర్ వ్యవహరంపై ప్రధానోపాధ్యాయురాలి దృష్టికి తీసుకెళ్లినప్పటికి స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటుందనే సాకుతో అటెండర్ ను మందలించి వదిలేసినట్లు తెలుస్తుంది. పైగా విషయం బయట తెలిస్తే టీసీలు ఇచ్చి పంపిస్తానంటూ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులను హెచ్చరించడం అదనుగా బావించిన అటెండర్ మరో అడుగు ముందుకేసి బాత్రూం లో సీసీ కెమెరాలు బిగించి ఆ సీసీ పుటేజ్ తో బ్లాక్ మెయిల్ దిగినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాత్రూంలో కెమెరాలను గమనించిన విద్యార్థులు హెడ్ మాస్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అటెండర్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తు విద్య వ్యవస్థను కుదిపేస్తున్నాయి.
అధికారుల అలసత్వం అటెండర్ ఆకృత్యాలు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘోర ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేసింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని తమ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు బాధ్యులైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పాఠశాల వద్ద నిరసనలు కొనసాగుతుండగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. నిందితుడు యాకూబ్ పాషాను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. విద్యార్థినుల నుంచి స్టేట్‌మెంట్‌లు, సీసీ ఫుటేజీలు సేకరిస్తూ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, ఏబీవీపీ నాయకులు గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని, పాఠశాలలో జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గంగాధర మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గంగాధర ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట గల ప్రధాన రహదారిపై గంటసేపు పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు గంగాధర ప్రవీణ్ మాట్లాడుతూ.. “బాలికలు చదువుకునే పాఠశాలల్లోనే ఇలాంటి దారుణాలు జరగడం చాలా విచారకరం అని, బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి” అని కోరారు. తల్లిదండ్రులు కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తుండగా, విద్యార్థులు భయంతో పాఠశాల ఆవరణలో నిలుచుని ఉన్నారు. సమాజంలో విద్యాసంస్థలు సురక్షిత ప్రదేశాలుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కురిక్యాల పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. “పిల్లలను చదువుకోమంటూ పంపితే ఇలాంటి దారుణాలు ఎదురవుతాయా?” అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






