తల్లిపై అత్యాచార యత్నం.. తల్లి ఏం చేసిందో చూడండి!

by Naveena |

కొడుకు చేష్టాలను భరించలేక విసుగు చెందిన తల్లి దాడి చేయడంతో కొడుకు మృతి చెందిన సంఘటన ముత్తారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

తల్లిపై అత్యాచార యత్నం.. తల్లి ఏం చేసిందో చూడండి!
X

దిశ, ముత్తారం: కొడుకు చేష్టాలను భరించలేక విసుగు చెందిన తల్లి దాడి చేయడంతో కొడుకు మృతి చెందిన సంఘటన ముత్తారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ముత్తారం ఎస్సై గోపతి నరేష్ ,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన మహేష్ నరేష్ (33 )గత కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడు. దీంతో మద్యం సేవిస్తూ మద్యానికి డబ్బులు ఇవ్వకపోతే వారి తల్లిదండ్రులను కొడుతు బూతులు తిడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడు .

కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో మృతుడు నరేష్ అతిగా మద్యం సేవించి ఇంట్లోకి వచ్చి మరొక రూమ్ లో ఉన్న తన తల్లి మహేష్ లక్ష్మి,వద్దకు పోయి చేయి పట్టుకొని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతన్ని పక్కకు తోసి.. దగ్గర్లో ఉన్న రోకలి బండతో నరేష్ తలపై, నుదుటిపై, ఛాతిపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. డాక్టర్ లు పరిశీలించి నరేష్ చనిపోయడని తెలిపారు. మృతుడు నరేష్ తండ్రి మహేష్ రాజయ్య, ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంతిని సిఐ బి రాజు,ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.

Next Story