పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం..!

by Ratna Kumari |

పాత క‌క్ష‌ల కారణంగా ఓ వ్య‌క్తి పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంఘ‌ట‌న జ‌గిత్యాల ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

పాత కక్షలతో వ్యక్తిపై హత్యాయత్నం..!
X
దిశ, జగిత్యాల టౌన్ : పాత క‌క్ష‌ల కారణంగా ఓ వ్య‌క్తి పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంఘ‌ట‌న జ‌గిత్యాల ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. హ‌త్యాయ‌త్నం కేసులో ఆరుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి త‌ర‌లించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందుపల్లికి చెందిన అన్నమనేని సమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త అన్నమనేని శ్రీపతిరావు పై పాత కక్షలు పెట్టుకున్న గట్ల సాత్విక్, గట్ల వెంకటేష్, నడిమింటి విజయ్, చొప్పదండి రంజిత్, సావు సురేష్ (కృష్ణానగర్, జగిత్యాల), సిరిపురం హేమంత్ (గోవిందుపల్లి) అనువారు కలిసి శ్రీపతి రావు ఇంటికి వెళ్లి చంపాలనే ఉద్దేశంతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులను గొల్లపల్లి రోడ్డులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Next Story