- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం ప్రయత్నం
బండి సంజయ్ కుమార్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చొప్పదండి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్

దిశ, గంగాధర: కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చొప్పదండి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు మధురనగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రవణ్ మాట్లాడుతూ – “ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తున్న కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ పై అవమానకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోంది. ప్రజాహిత యాత్ర పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు” అని విమర్శించారు. ఆందోళనలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొని మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అక్కడికి చేరుకుని.. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని గంగాధర పోలీస్ స్టేషన్లకు తరలించారు.






