కత్తులతో దాడి.. ఇద్దరికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2023-03-28 17:00:24  IST  )

కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు గాయపడిన వైనం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

కత్తులతో దాడి.. ఇద్దరికి గాయాలు
X

దిశ, మల్యాల: కత్తులతో దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు గాయపడిన వైనం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మండల పరిధిలోని బలవంతపూర్ గ్రామానికి చెందిన దస్తగిరి వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇంటి వద్ద ఉన్న దస్తగిరి అతడి సోదరుడు మౌలానాను బైక్ పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి గాయపరిచారు. కత్తిపోట్లకు గురైన ఇద్దరు అన్నదమ్ములను స్థానికులు108 అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులలో ఒకరు అదే గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తిగా గుర్తించినట్లు మల్యాల ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు ఆయన వెల్లడించారు. కత్తిపోట్లకు గురైన దస్తగిరి ఇటీవల ఓ భూ తగాదా విషయంలో జైలుకు వెళ్లగా బెయిల్ పై నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే, భూ తగాదాకు సంబంధించిన విషయంలోనే దుండగులు దాడికి పాల్పడ్డారా లేక ఇంకేదైనా కారణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story