కౌశిక్ రెడ్డి ఇంటి పై కోడిగుడ్లు, ట‌మాటాల‌తో దాడి..!

by Nallavelli.Anjaneyulu |

స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుకు నిరసనగా హుజూరాబాద్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

కౌశిక్ రెడ్డి ఇంటి పై కోడిగుడ్లు, ట‌మాటాల‌తో దాడి..!
X

దిశ‌, హుజూరాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుకు నిరసనగా హుజూరాబాద్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేసి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదలు చేసారు. అనంతరం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చల్లూరి రాహుల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పంజాల అరవింద్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో దళిత ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హుజురాబాద్ నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వం రద్దు అయ్యేంత వ‌ర‌కు మా యూత్ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రవణ్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు బండ నవీన్, శనిగరపు తరుణ్, చిట్యాల రేవంత్, మండల ఉపాధ్యక్షులు మేకల రాజ్ కుమార్, చల్లూరి విష్ణు వర్ధన్ ప్రధాన కార్యదర్శి పంజాల రాజు గౌడ్, నాయకులు ఎండీ సాధిక్, జన్ను ప్రసాద్, బన్నీ పాల్గొన్నారు.

Next Story