జగిత్యాల ఎస్టీ బాలుర హాస్టల్‌లో దారుణం

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్టీ, గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జగిత్యాల ఎస్టీ బాలుర హాస్టల్‌లో దారుణం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్టీ, గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారుల పై హాస్టల్‌లో పని చేస్తున్న కామాటి శ్రీనివాస్ దారుణంగా ప్రవర్తించిన విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో రాత్రి సమయంలో పడుకున్న విద్యార్థులను శ్రీనివాస్ చీపురుతో చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీనివాస్ గత నాలుగు నెలలుగా మద్యం మత్తులో విధులకు హాజరవుతూ, విద్యార్థులను తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని తెలుస్తోంది. తాళ్ల ధర్మారం నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అతడు నిత్యం మద్యం మత్తులో డ్యూటీకి హాజరవుతున్నాడని విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించినప్పటికీ ఫలితం లేకపోయిందని సమాచారం. అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్‌కుమార్, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story