- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్-అలైవ్ : ఎస్పీ మహేష్ బి.గితే
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. ప్రజాపాలన ప్రాగతి ప్రణాళిక కార్యాచరణ లో బాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటి ఫలితాలే గడిచిన సంవత్సరంలో మొదటి మూడు నెలలతో పోల్చుకుంటే రెండు నెలల్లో సిరిసిల్ల సబ్-డివిజన్ పరిధిలో 42 శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం సంతోషకరమైన విషయమన్నారు.
ముఖ్యంగా ఇల్లంతకుంట, వీర్నపల్లి మండలాల్లో జీరో ప్రమాదాలు నమోదు కావడం ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాయని కొనియాడారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్స్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, మైనర్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు 80 శాతం ప్రధాన కారణాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని మొదటి గంటలో ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం గోల్డెన్ అవర్ పథకం ద్వారా రూ. 25, 000 నగదు ప్రోత్సాహకం అందజేస్తోందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి రెండు దరఖాస్తులు అందగా.. వాటిని కలెక్టర్ కి పంపామని, త్వరలో ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందేలా చూస్తామన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గురైన వాహనాలను ప్రదర్శనగా పెట్టి, ఏ కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగాయో వివరించారు. అనంతరం వాహనదారులకు, యువతకు హెల్మెట్ లు పంపిణీ చేశారు. విద్యార్థులు, క్రీడాకారులు, యువత ప్రజలతో కలసి రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేష్, ఎస్.ఐ లు నాగరాజు, ఉపేందర్, రవాణా శాఖ అధికారులు వంశిధర్, పృధ్విరాజ్ వర్మ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






