- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌లో చేరిన రామడుగు సర్పంచ్, ఉప సర్పంచ్, 50 మంది కార్యకర్తలు
వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది ముఖ్య కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దిశ, గంగాధర/ రామడుగు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అద్భుత ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చొప్పదండి శాసనసభ్యులు డా. మేడిపల్లి సత్యం అన్నారు. మంగళవారం రామడుగు గ్రామ సర్పంచ్ మొయిజ్, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, వార్డు సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది ముఖ్య కార్యకర్తలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కరీంనగర్‌లోని తన నివాస ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇచ్చి, పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి, ఒక ‘రోల్ మోడల్’ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. అధికారం కోల్పోయి ఉనికి కోసం ఆరాటపడుతున్న ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను, మాటలను నమ్మి ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావద్దని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రామడుగు, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






