రెండు ద్విచక్ర వాహనాలు డి వృద్ధునికి తీవ్ర గాయాలు

by Bhanu |   (  Updated:2025-06-01 15:55:34  IST  )

టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న ఓ వృద్ధుడిని మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రెండు ద్విచక్ర వాహనాలు డి వృద్ధునికి తీవ్ర గాయాలు
X

దిశ, శంకరపట్నం: టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న ఓ వృద్ధుడిని మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలంలోని అరకండ్ల గ్రామానికి చెందిన నేదురు భూమయ్య (59) చేపల కోసం ముత్తారం గ్రామముకు వచ్చి తిరిగి తన స్వగ్రామం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో భూమయ్యకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందిచడం తో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రున్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Next Story