- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండగట్టు చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
by Jakkula.Mamatha |
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కొండగట్టుకు చేరుకున్నారు.

X
దిశ, కొండగట్టు: జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కొండగట్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి చాపర్ ద్వారా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడనుండి రోడ్డు మార్గం ద్వారా నేరుగా కొండగట్టు ఆలయానికి బయలుదేరి వెళ్లారు. స్వామివారి దర్శనం తర్వాత టీటీడీ సహకారం తో 35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వసతి గదులు, మాల విరమణ మండపం ఇతరత్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ను చూడడానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
Next Story






