మొలంగూర్ లో రెచ్చిపోయిన దొంగలు

by Ratna Kumari |

కూతురు ఇంటికి వెళ్లి వచ్చేసరికి తన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

మొలంగూర్ లో రెచ్చిపోయిన దొంగలు
X

దిశ, శంకరపట్నం : కూతురు ఇంటికి వెళ్లి వచ్చేసరికి తన ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో గల బీసీ కాలనీలో నివాసం ఉండే మరాటి రాజేశ్వరి ఇంట్లో దొంగలు చోరీకి తెగబడ్డారని తెలిపింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో భద్రపరుచుకున్న అర్థ తులం బంగారం, 50 తులాల వెండి, రూ.30 వేల న‌గ‌దు ఎత్తుకెళ్లినట్లు వాపోయింది. మార్చి 2న జమ్మికుంట లోని తన కూతురు ఇంటికి వెళ్లి గురువారం ఉదయం వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉందని.. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం వెండి నగదు కనిపించలేదని వాపోయింది. సంఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని వేలిముద్రలను సేకరించారు. చోరీ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story