- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్ వాడీ సేవలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలి
అంగన్ వాడీ సేవలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము అన్నారు. గురువారం గోదావరిఖని 38వ డివిజన్ లో జరిగిన పిల్లలకి

దిశ, గోదావరిఖని : అంగన్ వాడీ సేవలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని 38వ డివిజన్ కార్పొరేటర్ నేలకంటి రాము అన్నారు. గురువారం గోదావరిఖని 38వ డివిజన్ లో జరిగిన పిల్లలకి అన్నప్రాసన, గర్భిణీ స్త్రీల శ్రీమంతం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపం నివారించడానికి పౌష్టికరహారం అంగన్ వాడీల ద్వారా అందిస్తున్నామన్నారు. పౌష్టిక విలువల ఆహార అవగాహన గురించి, పిల్లలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలలో శారీరక, మానసిక, పరిపక్వత ఎక్కువగా ఉంటుందని, వారిలో సృజనాత్మక తెలివితేటలు ఈ సమయంలో పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, పాశ్చాత్య ఆహార పోకడలకు పిల్లలను అలవాటు పరచొద్దని తెలిపారు. 38వ డివిజన్ లో అంగన్ వాడీలు చేస్తున్న కృషిని అభినందిస్తూ, మరింత అవగాహన డివిజన్ ప్రజలలో మెరుగుపరచాల్సిందిగా సూచించారు. అంగన్ వాడీ సూపర్ వైజర్ సరస్వతి, లిటిల్ అంగన్ వాడీల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు తిరుమల, స్వప్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు, కోటరాజు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, ప్రమోటర్లు పాల్గొన్నారు.






