- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాలలో అమానవీయ ఘటన
శ్మశాన వాటికలో భర్తను వదిలి భార్య వెళ్లింది. ఈ ఘటన జగిత్యాల పట్టణం లోని చింతకుంట లో చోటు చేసుకుంది.

దిశ, జగిత్యాల రూరల్ : శ్మశాన వాటికలో భర్తను వదిలి భార్య వెళ్లింది. ఈ ఘటన జగిత్యాల పట్టణం లోని చింతకుంటలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన ఎండ్రి కాయల శ్రీధర్ గత 5 సం. ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్ళాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడే కిడ్నీలు సంబంధించిన వ్యాధి నిర్ధారణ కావడంతో గత మూడు నెలల క్రితం గల్ఫ్ నుంచి జగిత్యాలకు తిరిగి వచ్చాడు. ఇక్కడ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడి పోయాయని వైద్యులు తెలిపారు. చికిత్స కోసం డబ్బులు లేక ఇటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. దీంతో తన భార్య శ్రీధర్ ను సమీపంలో ఉన్న చింతకుంట శ్మశాన వాటికలో వదిలేసి తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ ఘటన చూసిన 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన చూసి స్థానికులు కంట తడి పెట్టుకున్నారు.






