- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ కేసులన్నీ పరిష్కారం
13న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ పిలుపు

లోక్ అదాలత్ లో రాజీపడదగ్గ కేసులన్నీ పరిష్కారం
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
- 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాజీపడదగ్గ కేసులన్నీ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థానం ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజీ మార్గం రాజ మార్గమని, చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని తెలిపారు. పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు, పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలన్నారు. లోక్ అదాలత్ లో రాజీ పడిన ఇరువురు గెలిచినట్లేనని, ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, జిల్లా లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.






