- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
దిశ, మంథని : రేపు జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు మంథని మండలంలో అధికారులు కావాల్సిన

దిశ, మంథని : రేపు జరగబోయే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు మంథని మండలంలో అధికారులు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికె పూర్తి చేశారు. మంథని మండలంలో మొత్తం 35 గ్రామపంచాయతీ లు ఉన్నాయి. మొదటి విడతలో ఈ గ్రామపంచాయతీలో రేపు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారులు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలానికి బ్యాలెట్ బాక్స్ లు, ఎన్నికల సామాగ్రి ఇప్పటికే మండల కేంద్రాలకు చేరింది. మండలంలో మొత్తం 282 బూత్ లు ఉన్నాయి. మండలంలో ఆయా బూత్ లకు 35 మంది ఆర్ఓ, పీఓలను కేటాయించారు. బ్యాలెట్ పెట్టలను సామాగ్రిని సిబ్బందికి అధికారులు అప్పగించారు. అదే విధంగా 200 మంది పోలీస్ బందోబస్త్ నడుమ బస్సుల్లో పిఓ, ఆర్ ఓ లు బ్యాలెట్ బాక్స్ లు సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మంథని మండలం కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి డిస్టిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ ను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యవెక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంథని సీఐ బి. రాజు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.






