అల్గునూర్ రాజీవ్ రహదారిపై వరద బీభత్సం

by Bhanu |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.

అల్గునూర్ రాజీవ్ రహదారిపై వరద బీభత్సం
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా అల్గునూర్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తూ, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరంగల్ – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాన కొనసాగుతుండటంతో రహదారి మీదుగా ప్రయాణించేందుకు వాహనదారులు భయంతో వెనక్కి తగ్గుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Next Story