లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం

by Bhanu |

జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ ఎంజెపి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు

లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ కలకలం
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ ఎంజెపి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. గత రాత్రి వండిన చికెన్ కర్రీ లో మసాలా కారం ఎక్కువ అవ్వడం కారణంగా విద్యార్థులకు అజీర్ణం వాంతులు సమస్య తలెత్తినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచన మేరకు పాఠశాల ఆవరణలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి 40 మంది విద్యార్థులకు చికిత్స అందించినట్లు డిఎంహెచ్వో ప్రమోద్ కుమార్ తెలిపారు.


ఎక్కువగా అస్వస్థతకు గురైన ఐదుగురు విద్యార్థులను జగిత్యాల ఎం సి హెచ్ లోని పీడియాట్రిక్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎంసిహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు. అయితే డాక్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులు అధైర్య పడాల్సిన అవసరం లేదని పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా లక్ష్మీపూర్ ఎంజెపి ని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తనిఖీ చేశారు. హాస్టల్ మెస్ నుండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించినట్లు తెలిపారు. పాఠశాలను సందర్శించిన వారిలో ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ సౌజన్య, డిపిఓ రవీందర్ ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Next Story