- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్ల గడి బురుజుల పరిరక్షణకు కదిలిన అఖిలపక్షం
కోరుట్ల పట్టణంలోని చారిత్రక వారసత్వ సంపద అయిన గడి బురుజుల పరిరక్షణ కోసం అఖిలపక్ష నాయకులు ఐక్యంగా పోరాటానికి సిద్ధమయ్యారు.

దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలోని చారిత్రక వారసత్వ సంపద అయిన గడి బురుజుల పరిరక్షణ కోసం అఖిలపక్ష నాయకులు ఐక్యంగా పోరాటానికి సిద్ధమయ్యారు. శనివారం పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో గడి పరివాహక భూముల ఆక్రమణలపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గడి బురుజు ప్రాంతంలోని సుమారు 3 ఎకరాల 21 గుంటల గ్రామకంఠ భూమి అక్రమ కబ్జాకు గురవుతున్నట్లు నాయకులు గుర్తించారు. కొన్ని వర్గాలు మున్సిపల్ అధికారుల నుంచి అనధికారికంగా అనుమతులు పొందినట్లు సమాచారం ఉండటంతో దీనిపై చట్టబద్ధంగా పోరాడాలని నిర్ణయించారు.
మార్చి 30 సోమవారం గడి బురుజుల వద్ద భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టనున్నారు. ఇక అవసరమైతే ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా అఖిలపక్షం సిద్ధమైందని తెలిపారు. గడి బురుజుల భూమి కోరుట్ల ప్రజల ఆస్తి. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, సీపీఎం పట్టణ కార్యదర్శి కె. శంకర్, న్యూ డెమోక్రసీ నేత చింత భూమేశ్వర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ముజాహిద్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రఫీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు బొబ్బిలి కిషోర్, తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గం నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సీనియర్ నాయకుడు పోతని సత్యం, మాస్తిన్ సంఘ సభ్యుడు గుత్తుల గంగ నరసయ్య పాల్గొన్నారు.






