- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలకో వంద.. కొత్త ఎయిడ్స్ కేసులు
నెలనెల హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి సోకిన రోగులు నిత్యం మా దగ్గరికి వస్తుంటారు. కౌన్సెలింగ్ నిర్వహించ

దిశ, గోదావరిఖని: పెద్దపెల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హెచ్ఐవీ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ కు వస్తున్న రోగుల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ సెంటర్ లో నెలకు కొత్తగా వంద హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇందులో యువతతోపాటు భార్యా, భర్తలు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఈ ఏఆర్టీ సెంటర్లో ఐదువేల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు తమ పేర్లను నమోదు చేసుకోగా, వారికి వైద్యం అందిస్తున్నారు. విచ్ఛలవిడి శృంగారంతోపాటు పలు ఇతర అంశాలు కూడా వ్యాధి వ్యాప్తికి కారణంగా తెలుస్తున్నది.
వివాహేతర సంబంధాలు.. ఇతర కారణాలు..
వివాహేతర సంబంధాలతోపాటు పలు ఇతర కారణాలు వ్యాధి వ్యాప్తిని పెంచుతున్నట్లు తెలుస్తున్నది. సోషల్ మీడియా పరిచయాలతో వివాహేతర సంబంధాలు ఏర్పర్చుకోవడం, వ్యభిచార గృహాలు కూడా వెలుస్తుండడంతో విచ్ఛలవిడి శృంగారం ఎక్కువ కావడం ఈవ్యాధి పెరుగుదలకు ప్రధాన కారణమనే చర్చ జరుగుతున్నది. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అనుకున్న మేర ఫలితం ఉండడం లేదని వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు ఒకరు వాడిన ఇంజక్షన్ ను మరొకరికి వాడడం, హెచ్ఐవీ ఉన్న వారు తెలియక రక్తదానం చేయడం వంటి కారణాల వల్ల కూడా ఈ వ్యాధి పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పరిచయం లేని వ్యక్తులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కౌన్సెలింగ్ చేస్తున్నాం
-పల్లెర్ల రమేశ్ గౌడ్, కౌన్సెలర్, ఏఆర్టీ సెంటర్
నెలనెల హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి సోకిన రోగులు నిత్యం మా దగ్గరికి వస్తుంటారు. కౌన్సెలింగ్ నిర్వహించి వారి మానసిక ఆందోళనను తగ్గిస్తున్నాం. మందులతోపాటు కౌన్సెలింగ్ ద్వారా వారిలో ధైర్యాన్ని నింపవచ్చు.
వివాహేతర సంబంధాలే ప్రధానకారణం
-డాక్టర్ దండే రాజు, ఆర్ఎంఓ, గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరగడానికి వివాహేతర సంబంధాలు, విచ్ఛలవిడి శృంగారమే ప్రధాన కారణం. శారీరకసంబంధాల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా హెచ్ఐవి సోకే ప్రమాదముంది. ఒకరు వాడిన ఇంజక్షన్స్ మరొకరు వాడ-డం, రక్తమార్పిడి తదితర మార్గాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ సోకకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.






