గోదావరిలో వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by velandi.Saikiran |

ఆడ్లూరి లక్ష్మన్ ధర్మపురి తీరంలోని స్నాన ఘట్టాల వద్ద గోదావరి ఉధృతిని అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు.

గోదావరిలో వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెల్గటూర్ : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎస్ఆర్ఎస్, పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి భారీ ఎత్తున వరదను గోదావరిలోకి వదిలారు. ఈ క్రమంలో ధర్మపురి తీరం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్.. బుధవారం ధర్మపురి తీరంలోని స్నాన ఘట్టాల వద్ద గోదావరి ఉధృతిని అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు గోదావరి లో పెరుగుతున్న వరద పరిస్థితిని ఎప్పటి కప్పుడు గమనిస్తూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

గోదావరికి వచ్చే భక్తులు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎల్లప్పుడూ గజ ఈతగాళ్లను అందు బాటులో ఉంచాలని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఏదయినా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే తనకు సమాచారం అందించాలని మంత్రి ఆడ్లూరి లక్ష్మన్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story