నిందితుడికి ఐదు సంవత్సరాల కారాగార శిక్ష

by Nallavelli.Anjaneyulu |

నిందితుడికి ఐదు సంవ‌త్స‌రాల కారాగార శిక్ష‌తో పాటు రూ.4వేలు జ‌రిమానా విధించారు. అలాగే బాధితురాలు కి రూ.3ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లిచాల‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా 3వ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి ఏ. నీర‌జ ఆదేశించారు.

నిందితుడికి ఐదు సంవత్సరాల కారాగార శిక్ష
X

దిశ, గోదావరిఖని : నిందితుడికి ఐదు సంవ‌త్స‌రాల కారాగార శిక్ష‌తో పాటు రూ.4వేలు జ‌రిమానా విధించారు. అలాగే బాధితురాలు కి రూ.3ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లిచాల‌ని క‌రీంన‌గ‌ర్ జిల్లా 3వ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి ఏ. నీర‌జ ఆదేశించారు. గోదావ‌రి ఖ‌ని వ‌న్ టౌన్ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఎఫ్ సీఐ నివాసురాలైన గంగార‌పు శార‌దాదేవి, గోదావ‌రిఖని కి చెందిన ముత్యాల సుద‌ర్శ‌న్ తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 2010లో అతడు ఆమెను పెళ్లి చేసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమెను గర్భవతిని చేసి, నీకు, నాకు సంబంధం లేదు, నువ్వు మాదిగ కులస్తురాలివి అంటూ ఆమెను, ఆమె తమ్ముడిని, తల్లిని దూషించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి (ప్రస్తుతం అడిషనల్ డీసీపీ, సైబర్ క్రైమ్, హైదరాబాద్)గా వ్యవహరించగా, కోర్టులో ప్రభుత్వ తరఫున ఏపీపీ కోలా ఝాన్సీ వాదనలు వినిపించారు. కోఆర్డినేషన్ ఆఫీసర్‌గా ఏ.ఇంద్రసేనారెడ్డి లైజన్ ఆఫీసర్‌గా వి.తిరుపతి రావు, సీడీఓగా ఏ.మహేందర్ విధులు నిర్వహించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, పక్కా సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించడంతో నిందితుడికి శిక్ష పడిందని తెలిపారు. ప్రాసిక్యూషన్ టీమ్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ సందర్భంగా వారిని అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Next Story