- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడు మహమ్మద్ రజాక్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తోపాటు రూ.15,000 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ( ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ ఫోక్సో కోర్టు ) జడ్జి రత్న పద్మావతి తీర్పునిచ్చారు.

దిశ, జగిత్యాల టౌన్ : మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన నిందితుడు మహమ్మద్ రజాక్ కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15,000 జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ( ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు ) జడ్జి రత్న పద్మావతి తీర్పునిచ్చారు. అదే సమయంలో బాధిత మైనర్ బాలికకు రూ.3 లక్షల పరిహారం కల్పించాలని ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మైనర్ బాలికను నిందితుడు మహమ్మద్ రజాక్ అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడి పై పోక్సో చట్టం కింద 2022 సంవత్సరంలో మల్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా.. అప్పటి ఇన్ స్పెక్టర్ రమణమూర్తి దర్యాప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకి ఆధారాలు సమర్పించగా.. పిపి రామకృష్ణ రావు, కోర్టు డ్యూటీ అధికారులు సాక్ష్యం ప్రవేశపెట్టగా.. సాక్షులను విచారించిన న్యాయమూర్తి రత్న పద్మావతి మంగళవారం నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో నేరం చేసినవారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని, పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యూహాత్మకంగా న్యాయ విచారణను వేగవంతం చేసి, కచ్చితంగా శిక్షలు పడేలా చూస్తారని పేర్కొన్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన పిపి రామకృష్ణ రావు, ఇన్‌వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి, CMS ఎస్.ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ లు కె.వి. సాగర్, శ్రీధర్, కిరణ్ కుమార్ లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.






