జగిత్యాల డీడబ్ల్యూఓ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

by Ratna Kumari |   (  Updated:2026-05-05 09:43:16  IST  )

జగిత్యాల జిల్లాలోని డీడబ్ల్యూఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

జగిత్యాల డీడబ్ల్యూఓ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్ : జగిత్యాల జిల్లాలో డీడబ్ల్యూఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉదయం సుమారు 11 గంటలకు కలెక్టరేట్ లోని డీడబ్ల్యూఓ కార్యాలయానికి చేరుకున్న అధికారులు, అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత శాఖలో గతంలో పని చేసిన ఒక అధికారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన ఫైళ్లను ప్రత్యేకంగా వెరిఫై చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలోని పలు ముఖ్యమైన రికార్డులు, పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ శాఖపై అనేక ఆరోపణలు వెలువడిన పరిస్థితుల్లో తాజా ఏసీబీ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మంగళవారం రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి వెరిఫికేషన్ తర్వాతే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Next Story