- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ ఆలయ అభివృద్దిపై ఎలాంటి అపోహలు, ఆందోళనలు వద్దు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి అనేది తన ఒక్కడి ఎజెండా కాదని, ఇది

దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి అనేది తన ఒక్కడి ఎజెండా కాదని, ఇది రాజన్న భక్తుల ఎజెండా అని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్ లో రాజన్న ఆలయ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి పనుల వివరాలతో పాటు చిత్రాలను, 3డి మ్యాప్ లను వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, రాజన్న ఆలయ ఈవో రాధాబాయి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి, సలహాదారు హరి రామ్ తో పాటు పట్టణానికి చెందిన ఆయా పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు, ఆలయ అర్చకులు, వేద పండితులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా గత ఏడాది నవంబర్ 20న రాజన్న ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఒకేసారి రాజన్న ఆలయం అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇందులో భాగంగా ఇప్పటికే రూ.6 కోట్ల50లక్షలతో మూల వాగు నుండి రాజన్న ఆలయం వరకు 800మీటర్ల దూరం ఉన్న 80ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. పనులన్నీ మొదలయ్యాక బడ్జెట్ సమస్య వస్తుందని చాలామంది అపోహ పడుతున్నారని, ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికే రూ.47 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని పేర్కొన్నారు. ప్రజలెవరు బడ్జెట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి సహకారంతో అనుకున్న సమయానికి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.






