- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధార్ సెంటర్ల ఇష్టారాజ్యం.. సవరణకు రూ.2వేలు వసూళ్లు
ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆధార్ కార్డులలో తప్పులను సరి చేయడానికి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేస్తున్నారు.

ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆధార్ కార్డులలో తప్పులను సరి చేయడానికి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు నకిలీ పత్రాలను సృష్టిస్తూ కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నకిలీ పత్రాల ద్వారా ప్రభుత్వ ఈ సేవ సెంటర్లో ఆధార్ కార్డ్ తప్పులను సరి చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ సేవా సెంటర్ల నిర్వాహకులు ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నిర్వాహకుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొద్దిపాటి తప్పులు సరి చేయడానికి కూడా రూ.వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
- దిశ, మిర్యాలగూడ
దిశ, మిర్యాలగూడ : ప్రైవేట్ ఆధార్ సెంటర్ల యాజమాన్యం ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆధార్ కార్డులలో తప్పులను సరి చేయడానికి రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు తప్పులు సరి చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూళ్లు చేసి నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఈ నకిలీ పత్రాల ద్వారా ప్రభుత్వ ఈ సేవ సెంటర్లో ఆధార్ కార్డ్ తప్పులను సరి చేస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ సేవా సెంటర్ నిర్వాహకులు ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నిర్వాహకుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొద్దిపాటి తప్పులు సరి చేయడానికి కూడా రూ.వేల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ప్రైవేట్ సెంటర్లలోనే వసూళ్లు..
ఆధార్ కార్డులో పేరులో అక్షరం కానీ, ఇంటి పేరు కానీ, తండ్రి పేరు కానీ, పుట్టిన తేదీ, వయసు తదితర వాటిలలో ఏదైనా తప్పుగా పడినట్లయితే వాటిని సరి చేయించుకునేందుకు వెళ్లిన కస్టమర్ల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఈ సేవ సెంటర్ల ద్వారా ప్రైవేట్ ఆధార్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డులో వయసు ఎక్కువగా ఉన్నవారికి వయసు తగ్గించడం కోసం నకిలీ ధ్రువ పత్రాలను తయారు చేసి అప్ టోడ్ చేస్తున్నారు. నకిలీ ధృవపత్రాలు తయారు చేసేందుకు కస్టమర్ల నుంచి రూ.2వేలనుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఈ సేవల సహకారం..
ఆధార్ కార్డు తప్పులను సవరించేందుకు ప్రైవేట్ ఆధార్ సెంటర్ నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడానికి ప్రభుత్వ ఆధీనంలోని ఈ సేవ సెంటర్ నిర్వాహకులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలోని సుమారు పది ప్రైవేట్ ఆధార్ సెంటర్లు ఉండగా ఒకే ఒక్క ప్రభుత్వ సెంటర్ ఉంది. తప్పులను సరి చేయడానికి ప్రైవేట్ సెంటర్ వారు వసూలు చేసిన డబ్బులో ప్రభుత్వ సెంటర్‌కు చెందిన నిర్వాహకులకు అందుతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పులను సరి చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్న ఆధార్ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది. దీంతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు నియోజకవర్గ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సంబంధిత ప్రైవేట్ ఆధార్ సెంటర్ నిర్వాకుల పైనా, అందుకు సహకరిస్తున్న ప్రభుత్వ సెంటర్ నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






