పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు

by Ratna Kumari |

పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌ ఓ యువ‌కుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు
X

దిశ, కరీంనగర్ రూరల్ : పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌ ఓ యువ‌కుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌రీంన‌గ‌ర్ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన యువ‌తితో వ‌రంగ‌ల్ జిల్లా కి చెందిన వ‌రుణ్ అనే యువ‌కుడు కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరికి డిజిట‌ల్ యాప్స్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ యువ‌తిని ప్రేమిస్తున్నాన‌ని.. పెళ్లి చేసుకోవాలంటూ రోజు ఫోన్ చేస్తూ వేధించ‌డంతో ఈ విష‌యాన్ని గ‌మనించిన యువ‌తి త‌ల్లిదండ్రులు క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

మంగ‌ళ‌వారం పోలీసులు ఆ యువ‌కుడిని అదుపులోకి తీసుకొని అడ్ర‌స్, ఐడీ ప్రూఫ్ త‌దిత‌ర వివ‌రాల‌ను స్వీక‌రించారు. అయితే యువ‌కుడు పొంత‌న లేని స‌మాధానం చెప్పాడు. అయితే ఆ అమ్మాయిని త‌న వెంట పంపించాల‌ని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం రాత్రి స్టేష‌న్ వ‌ద్ద పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవ‌డం ఇప్పుడు జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. వెంట‌నే పోలీసులు ఆ యువ‌కుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ప‌రిస్తితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ‌రుణ్ అనే వ్య‌క్తి పెట్రోల్ పోసుకొని ఎందుకు నిప్పు అంటించుకున్నాడ‌నే సందేహాలు క‌లుగుతున్నాయి. పోలీసులు అత‌ని పై ఏమైనా దురుసుగా ప్ర‌వ‌ర్తించారా..? లేక ఏమైనా జ‌రిగిందా అని ర‌క‌ర‌కాలుగా అనుమానాలు క‌ల‌గ‌డం గ‌మ‌నార్హం.

Next Story