- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్టి మాఫియా ధన దాహానికి యువకుడు బలి
ట్రాక్టర్ ఓనర్ నిర్లక్ష్యం కారణంగా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలంలో మట్టి మాఫీయా ఆగడాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ధన దాహం చివరికి ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన స్థంభంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంబంపల్లి గ్రామానికి చెందిన జేసీబీ ఓనర్ గోరువంతుల సతీష్ కొంత మంది ట్రాక్టర్ ఓనర్లతో కలిసి సర్వే నెంబర్ 1090 కి చెందిన ప్రభుత్వ భూమిలో రాత్రిపూట మట్టిని అక్రమంగా తరలించేందుకు ప్లాన్ వేశారు. మంగళవారం రాత్రి స్థంబంపల్లి గ్రామానికి చెందిన పలు ట్రాక్టర్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మట్టిని తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన లవంగం రాజేష్ ట్రాక్టర్ పై అవునూర్ డ్రైవర్ గా కొనసాగుతున్నాడు. ట్రాక్టర్ లో మట్టిని నింపుకొని గ్రామానికి వెళ్తుండగా.. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.
ట్రాక్టర్ ఓనర్ నిర్లక్ష్యం..
ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన ట్రాక్టర్, జేసీబీల ఓనర్లు ప్రమాద స్థలానికి చేరుకొని వెంటనే అతన్ని వెల్గటూర్ లోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెల్లారు. తీవ్రంగా గాయపడిన అతడినీ ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఇంట్లో వదిలేశారు. రమేష్ ఉదయం నుంచి ఏమి తినలేదని.. మద్యం సేవించాడని కుటుంబ సభ్యులకు అబద్ధం చెప్పారు. రాత్రి కావడంతో అతనికి కడుపు నొప్పి తీవ్రం కావడంతో ట్రాక్టర్ బోల్తా పడిందని రమేష్ ఇంట్లో చెప్పాడు. దీంతో వారు వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో తుది శ్వాస విడిచారు. ట్రాక్టర్ ఓనర్ నిర్లక్ష్యం కారణంగానే రమేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉన్న ఒక్కగానొక్క ఆధారం కోల్పోయి వీధిన పడ్డామని.. మాకు న్యాయం చేయాలని మృతుడి భార్య, పిల్లలు బోరున విలపించారు. ఈ ఘటన పై బాధితులు వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహంతో రాస్తారోకో
"తమది నిరుపేద కుటుంబం అని.. కుటుంబాన్ని పోషించే వాడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మా బతుకు వీడిన పడింది. మాకు ఉన్న ఒక్క ఆధారాన్ని కోల్పోయాం. ఆర్థిక సహాయం చేసి తమను ఆదుకోవాలి" అని రమేష్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ రహదారిపై కొత్తపల్లి వద్ద రాస్తారోకో చేశారు. కొద్ది సేపు రోడ్డు పై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎస్సై ఉదయ్ కుమార్ జోక్యం చేసుకొని తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మనుషులతో చర్చించి రూ.5లక్షలు ఆర్థిక సహాయం ఇప్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు శాంతించారు.






