- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేకలను కాపాడబోయి యువకుడు మృతి
మేకలను కాపాడే ప్రయత్నంలో కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి మండలంలో విషాదం నింపింది.

దిశ,పెద్దపల్లి : మేకలను కాపాడే ప్రయత్నంలో కాలువలో పడి యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి మండలంలో విషాదం నింపింది. చందపల్లికి చెందిన సయ్యద్ సహద్ (19) తండ్రి ఖాదర్, పెద్దపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సహద్ తన మేకలను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లాడు. ఈ క్రమంలో చందపల్లి శివారులోని పవర్ హౌస్ సమీపంలో వద్ద కొన్ని మేకలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాయి. మేకలను బయటకు తీసేందుకు ప్రయత్నించిన సహద్, అదుపు తప్పి కాలువలో పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతకగా గురువారం రాత్రి అతని ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం పవర్ హౌస్ సమీపంలో సహద్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయంపై అతని తండ్రి ఖాదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






