ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి

by Nallavelli.Anjaneyulu |

సొంత వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ తీసుకెళ్లిన యువకుడు ఆ ట్రాక్టర్ బోల్తా పడి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది.

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి
X

దిశ, గొల్లపల్లి : సొంత వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ తీసుకెళ్లిన యువకుడు ఆ ట్రాక్టర్ బోల్తా పడి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల మండలం లంబాడి పల్లి గ్రామానికి చెందిన లెంకల లక్ష్మణ్ మండలంలోని బీ.బీ. రాజ్ పల్లి గ్రామంలో గల తన మేనత్త పొలం వద్ద ఉన్న పసుపు కొమ్ములు తీసుకువెళ్ళడానికి తన ట్రాక్టర్ లో వచ్చాడు. అయితే తిరిగి వెళ్తున్న క్రమంలో బీబీ రాజ్ పల్లె గ్రామ శివారులో తను నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీ తో సహా బోల్తా పడగా యువకుడు ఇంజన్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి.

Next Story