కడుపు నొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ రూరల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

కడుపు నొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ : కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ రూరల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లికి చెందిన రోడ్డ వంశీ (29) గత రెండేళ్ల నుంచి క్లోమం వ్యాధి కారణంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రిలో వైద్యం చేపించుకున్నప్పటికీ కడుపునొప్పి నయం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడినట్లు సీఐ తెలిపారు. మృతుడి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

Next Story