- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూరగాయల గుడిసెల పైకి దూసుకెళ్లిన వాహనం
వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది.

దిశ, వేములవాడ: వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్డును అనుకొని ధోబిఘాట్ల సమీపంలో ఏర్పాటు చేసిన కూరగాయల గుడిసెల పైకి శుక్రవారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లింది. దీంతో గుడిసెలన్ని పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వాహనం దాటికి గుడిసెలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడి పోయింది.
ప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడం, అక్కడ ఎలాంటి జనసంచారం లేకపోవడంతో.. కేవలం గుడిసెలు మాత్రమే ధ్వంసం అయ్యాయి. అదే ఉదయం వేళల్లో అయితే పరిస్థితి ఎలా ఉండేదని, ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవో అని అక్కడి కూరగాయలు విక్రయించే రైతులతో పాటు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో జరిగిన ఇలాంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందే హెచ్చరించిన దిశ
వాస్తవానికి రెండవ బైపాస్ రోడ్డు పక్కన ప్రమాదకర స్థితిలో కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయని, ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే అంటూ 'దిశ' పత్రిక ఈ మధ్య కాలంలోనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినప్పటికీ కూరగాయల విక్రయదారులు అక్కడి నుండి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీనికి తోడు అధికారులు సైతం విక్రయిదారులకు అవగాహన కల్పించి వారిని అక్కడి నుండి పంపించేందుకు ఎలాంటి చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరే ఈనాటి సంఘటనలో జనసంచారం లేక ఎవరికి ఏమి కాలేదని, కానీ ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లోనూ పునరావృతమై రాత్రి జరిగిన సంఘటన ఉదయపు వేళలో జరిగితే పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విక్రయిదారులను అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు తరలించాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. వేచి చూడాలి మరి ఏమి జరుగుతుందో...?






