- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటం అవసరం : మహమ్మద్ ఖాళీద్ హుస్సేన్
దిశ, హుజరాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు

దిశ, హుజరాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఈ విషయంలో విమర్శలు చేస్తున్న వారిపై ప్రజా సంఘాల నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఖాళీద్ హుస్సేన్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారికి హుజురాబాద్ పట్టణంలో నివాళులర్పిస్తూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కమిషన్‌ను నియమించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సర్వేలు నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపిందని ఖాళీద్ హుస్సేన్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీల గర్జనలో పాల్గొని పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారని తెలిపారు.
అనంతరం స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేయగా సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఆ జీవోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉందని వివరించారు. "ఏ ప్రభుత్వం చేయనటువంటి పని మన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాల కొరకు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని పక్కన పెట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దుష్ప్రచారాలు చేయడం సరికాదు," అని ఆయన మండిపడ్డారు. మన హక్కులను సాధించుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ ఏకమై పోరాటం చేద్దాం. బీసీ ల ఐక్యత వర్ధిల్లాలి," అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ జమదగ్ని ,జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.






