ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల అడ్డగింత

by velandi.Saikiran |

ప్రైవేటు పాఠశాలల బస్సుల‌ను అడ్డ‌గించిన త‌రుణంలో కాచాపూర్ లో ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది.

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుల అడ్డగింత
X

దిశ, శంకరపట్నం: స‌ర్కార్ బడులు కాద‌ని, పిల్లలను ప్రైవేటు పాఠశాలలు తరలించుకుపోతున్నాయ‌ని కాచాపూర్ గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఊకంటి మాధవి ప్రైవేట్ స్కూలు బస్సులను అడ్డగించారు. ప్రభుత్వ పాఠశాల మూతపడితే, పేద పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఊకంటి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story