- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్న కలల కోసం విదేశాలకు.. స్వగ్రామంలో కన్నీటి వీడ్కోలు
జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని ఎన్నో కలలతో ఎడారి దేశం ప్రయాణమైన యువకుడు విధి వక్రీకరించి మృత్యువాతకు గురై స్వగ్రామానికి నిర్జీవీగా చేరుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

దిశ, కొడిమ్యాల : జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని ఎన్నో కలలతో ఎడారి దేశం ప్రయాణమైన యువకుడు విధి వక్రీకరించి మృత్యువాతకు గురై స్వగ్రామానికి నిర్జీవీగా చేరుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామానికి చెందిన కుక్కల మధు (25) జీవితంలో పెద్ద ఆశలు పెట్టుకున్నాడు. తండ్రి లేని తన కుటుంబానికి అండగా నిలవాలని, మంచి భవిష్యత్ కోసం ఇరాక్‌లో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకొని ప్రయాణమయ్యాడు. మూడు సంవత్సరాలు ఇరాక్ లో ఉద్యోగం చేసి సెలవు లపై స్వగ్రామానికి వచ్చి తన సోదరి కి వివాహం జరిపించి నాలుగు నెలల క్రితం ఇరాక్ దేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.
ఇంతలోనే తన కల పూర్తిగా నెరవేరకుండా విధి వక్రీకరించింది. నెల రోజుల కిందట అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నేడు మధు మృతదేహం స్వగ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామం అంతా శోకసంద్రంగా మారింది. తల్లి కన్నీటి పర్యంతమై విలపిస్తుండగా.. బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు హృదయ విదారకంగా చివరి వీడ్కోలు పలికారు. ఈ కష్ట సమయంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానవీయ కోణంలో ముందుకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటి వరకు ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి కుటుంబానికి తోడుగా నిలిచారు. గ్రామస్థులు, బంధువులు, ప్రజాప్రతినిధులు కలిసి మధు కుటుంబానికి భరోసా ఇవ్వాలని, ప్రభుత్వ సహాయం అందించాలని కోరుతున్నారు.






