మహిళల ఆరోగ్యంతోనే బలమైన కుటుంబం

by Elthuri vijay kumar |

ఆరోగ్యవంతమైన మహిళలతోనే బలమైన కుటుంబంగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.

మహిళల ఆరోగ్యంతోనే బలమైన కుటుంబం
X

మహిళల ఆరోగ్యంతోనే బలమైన కుటుంబం

నాడు డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లాలి

నేడు కోరుట్లలోనే సెంటర్ ఏర్పాటు

ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

దిశ, కోరుట్ల రూరల్: ఆరోగ్యవంతమైన మహిళలతోనే బలమైన కుటుంబంగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని అయిలాపూర్ గ్రామంలో స్వస్థ్‌ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశ్యంతో మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టబడిందన్నారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు నాడు డయాలసిస్ కొరకు హైదరాబాద్ కు వెళ్ళేవారాని, నేడు కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకుంటున్నారన్నారు. కెసిఆర్ హయాంలోనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రి 100 పడకల ఆసుపత్రిగాను, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా, మిషన్ భగీరథ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో అమలులోకి వచ్చాయని, తల్లి, బిడ్డ క్షేమం కొరకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేశారని, నేడు ఇది అమలులో లేక పోవడంతో గర్భవతులకు సరైన పోషకాలు కలిగిన ఆహారం అందడం లేదన్నారు. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గర్భవతులకు న్యూట్రిషన్ కిట్ అందజేయాలన్నారు. అనంతరం ఆసుపత్రి ఏర్పాటుచేసిన బోర్ పంపును గ్రామంలో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్, డాక్టర్ మణిదీప్, డాక్టర్ తబుస్సుమ్, ధనుంజయ్, భూషణ్, జెస్సీ కుమారి, సీడీపీఓ మణెమ్మ, ఐసిడిఎస్ సూపెర్వైసోర్ భారతి, టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, నాయకులు పిడుగు సందయ,య గడికొప్పుల గోపాల్, గిన్నెల అనంతస్వామి, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story