- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
by Kema Shiva Kumar |
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రగుడులో ఆదివారం తెల్లవారుజామున వీధి కుక్కలు పలువురిపై దాడి చేశాయి.

X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు రగుడులో ఆదివారం తెల్లవారుజామున వీధి కుక్కలు పలువురిపై దాడి చేశాయి. ఈ దాడిలో మూడేళ్ల బాలుడు, గీత కార్మికుడు, వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా స్థానికులు సిరిసిల్ల ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల దాడితో వార్డు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బీజేపీ యువ మోర్చ పట్టణ అధ్యక్షుడు వంగ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.
Next Story






