- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీమేశ్వర ఆలయ కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించాలి
భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించాలని కోరుతూ శనివారం బీజేపీ వేములవాడ

X
దిశ, వేములవాడ: శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంద ఆలయమైన భీమేశ్వరాలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించాలని కోరుతూ శనివారం బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈ ఓ రమాదేవికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గెస్ట్ హౌస్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ భీమేశ్వరాలయం అభివృద్ధిలో భాగంగా అన్యమతస్తులు చెప్పులు వేసుకుని గుడి ఆవరణలో పనులు చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ను తొలగించి వేరే కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలని డిమాండ్ చేశారు. భీమేశ్వరాలయం మాదిరిగానే రాజన్న ఆలయం డెవలప్మెంట్ లో భాగంగా భక్తులకు దర్శనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






