అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్
X

దిశ, ఎల్లారెడ్డి పేట : ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా ఇసుక‌ను త‌ర‌లిస్తున్న వ్య‌క్తిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కే.రాహుల్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండల ప‌రిధిలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆల‌కుంట రాజు(41) ఇసుక‌ను అక్ర‌మంగా త‌ర‌లిస్తుండ‌గా.. గురువారం అరెస్ట్ చేశారు. అనంత‌రం మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌గా.. 14 రోజుల జ్యూడిషియ‌ల్ రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా ఎవ‌రైనా అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తే.. వారిపై కేసు న‌మోదు చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్సై రాహుల్ రెడ్డి హెచ్చ‌రించారు.

Next Story