- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోరంటాలలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది.

X
దిశ, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బైపాస్ వద్ద సిరిసిల్ల కామారెడ్డి హై పై గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి చెందిన బత్తుల రాజయ్య (70) అనే వ్యక్తి మందుల కోసం సైకిల్ పై ఎల్లారెడ్డిపేటకు వెళ్తుండగా వెనకాల నుండి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి బస్సు పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






