- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు ప్రతి నెల మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి : కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి
సింగరేణి ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని, అన్ ఫిట్ చేయబడిన కార్మిక వారసులకు తక్షణమే యోగాలు ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజి రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలని, అన్ ఫిట్ చేయబడిన కార్మిక వారసులకు తక్షణమే యోగాలు ఇవ్వాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గోదావరిఖని టూ ఇంక్లైన్ కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తి తీసి దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులకు ప్రతి నెల మెడికల్ బోర్డులు నిరంతరాయంగా నిర్వహించాలని, మెడికల్ అన్ఫిట్ చేయబడిన కార్మిక వారసులకు తక్షణమే ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవాలన్నారు. జూలై, నవంబర్ నెలలో అర్హత కలిగి అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికులకు అన్ ఫిట్ చేయాలన్నారు. విజిలెన్స్, మారుపేరుల సమస్యను పరిష్కరించాలని, మెడికల్ బోర్డు రద్దుకై సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను విరమించుకోవాలన్నారు.
గత రెండు సంవత్సరాల నుంచి మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్న రెండు వేలకు పైగా కార్మికులకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 50 వేల కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలు కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. వీరి మాట నమ్మిన కార్మికులు మోసపోయారు. టీబీజీకేఎస్ మాత్రమే కార్మికుల హక్కులను పరిష్కరించగలిగిందని తెలిపారు. ఇప్పటికైనా విచారణ పేరుతో మెడికల్ బోర్డు నిర్వహించకుండా ఈ వేయడం సరికాదన్నారు. వారసులకు ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తు మేనేజర్ కి వినతి పత్రం అందజేశారు. వడ్డేపల్లి శంకర్ ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ అధ్యక్షత వహించగా నాయకులు మాదాసి రామ్మూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్, నూనె కొమురయ్య సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, దూట శేషగిరి బ్రాంచ్ సెక్రటరీ, ఉప్పులేటి తిరుపతి ఫిట్ సెక్రెటరీ, మీసా రాజు, పూర్ణ చందు, భాస్కర్ ,వేణు, నరేష్, శ్రీకాంత్ ,అభిషేక్, రవి, ప్రసాద్, ప్రవీణ్, సుల్తాన్, మధు, రమేష్, తిరుపతి, రాహుల్, సుకుమార్ పాల్గొన్నారు.






