కరీంనగర్‌లో భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు

by Ratna Kumari |

జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కరీంనగర్ పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ క్రాక్‌డౌన్" లో భాగంగా ఒక భారీ వ్యవస్థీకృత నేర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

కరీంనగర్‌లో భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కరీంనగర్ పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ క్రాక్‌డౌన్" లో భాగంగా ఒక భారీ వ్యవస్థీకృత నేర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సైబర్ మోసాలకు కీలకమైన "మ్యూల్ బ్యాంక్ ఖాతాలను" (Mule Accounts) సృష్టించి సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారితో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నేర విధానం :

కరీంనగర్-II టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని (Cr No. 84/2026, U/s 112, 318 (4) BNS, Sec 66-D IT Act, PS Karimnagar-II Town) ప్రకారం.. కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తులో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అమాయక వ్యక్తుల పేరుతో లేదా స్వయంగా వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, కరెంట్ ఖాతాలను తెరిచేవారు. ఆ ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్స్, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులను పైస్థాయి సైబర్ నేరగాళ్లకు విక్రయించేవారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు గురైన బాధితుల డబ్బును చేతులు మార్చడం (Layering), ఉపసంహరించుకోవడం చేసేవారని సీపీ తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం పోలీసులు ప్ర‌ధాన నిర్వాహ‌కుడు రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు క‌రీంన‌గ‌ర్ కి చెందిన మ‌రో 11 మంది స‌హ‌చ‌రుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ముదుగుంటి రాజేశ్వ‌ర్ రెడ్డి, భ‌గ‌త్ న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్, నంద‌గిరి సాయి వ‌ర్ద‌న్, కిషాన్ న‌గ‌ర్, క‌రీంన‌గ‌ర్, కాలిదాస్ కౌశిక్, దోబీవాడ‌, క‌రీంన‌గ‌ర్, ములంకుల రాజ్ కుమార్, క‌ట్ట‌రాంపూర్, క‌రీంన‌గ‌ర్, బండి సాయి కృష్ణ, కన్నాపూర్, శంకరపట్నం మండలం, అడవెల్లి సాయి కార్తిక్, విద్యానగర్, కరీంనగర్, మీర్ జామీ ఉద్దీన్, స్వరణ్ స్ట్రీట్, కరీంనగర్, మహమ్మద్ జవాద్ ఖాన్, స్వరణ్ స్ట్రీట్, కరీంనగర్, సర్దార్ దల్జీత్ సింగ్, కోతిరాంపూర్, కరీంనగర్,పల్లెర్ల అజయ్, వెంకట్రావుపల్లి, లక్ష్మీపూర్ గ్రామము రామడుగు మండలం, నిర్మల్ల శివ, మారుతినగర్, కరీంనగర్, దిద్దీ సాయి చరణ్, రుక్మాపూర్, చొప్పదండి మండలం. ఈ ముఠా స‌భ్యులు కేవ‌లం ఒక్క కేసులోనే కాకుండా క‌రీంన‌గ‌ర్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని కేసుల్లో ఈ నిందితులు ప్ర‌మేయం ఉన్న‌ట్టు పోలీసులు నిర్థారించారు. వీరి వద్ద నుంచి కీలక పత్రాలు, బ్యాంక్ కిట్లు ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీటిపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు.

​పోలీస్ కమిషనర్ ప్రశంసలు..

​సమర్థవంతంగా పని చేసి ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూ టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ సృజన్ రెడ్డి, ఎస్సైలు శ్రీనాథ్, పోచయ్య, సైబర్ క్రైమ్ ఎస్సై అనిల్, కానిస్టేబుల్ అనిల్, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ నుంచి వసీం , ఖాజా పాషా , రవి , వెంకటేష్, టూ త్రి టౌన్ లకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కృష్ణా రెడ్డి , శ్రీనివాస్ ,శంకర్ , లక్ష్మణ్ , పోలీసు కానిస్టేబుళ్లు సాయి కృష్ణ , అభినవ్ పోలీస్ అధికారులను, సిబ్బందిని, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజలకు విజ్ఞప్తి..

తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతాలు ఇవ్వడం, ఇతరుల కోసం అకౌంట్లు తెరవడం లేదా మీ ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు ఇతరులకు అప్పగించడం చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల మీరు కూడా సైబర్ నేరాలలో భాగస్వాములు అవుతారని, కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story